ఏపీ హైకోర్టులో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన

12-09-2021 Sun 12:18
  • రెండు ప్రకటనలు జారీ చేసిన రిజిస్ట్రార్
  • ఆన్ లైన్ లోనే దరఖాస్తులు
  • ఈనెల 30 వరకు స్వీకరణ
AP High Court Issues Notification For Various Posts

ఏపీ హైకోర్టులో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలనా విభాగం) డి. వెంకటరమణ రెండు వేర్వేరు ప్రకటనలను జారీ చేశారు.

ఇందులో భాగంగా 71 అసిస్టెంట్, 35 టైపిస్ట్, 39 కాపీయిస్ట్, 29 ఎగ్జామినర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 30గా ఖరారు చేశారు. మిగతా వివరాలను హైకోర్టు వెబ్ సైట్ లో పొందుపరిచారు.