JC Prabhakar Reddy: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సదస్సు.. వివాదాస్పదమైన జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు

  • సమావేశం మధ్య నుంచే బయటకు వచ్చేసిన జేసీ
  • హంద్రీనీవా, టీఎంసీలు అంటే ఎవరికీ అర్థం కావని వ్యాఖ్య
  • చంద్రబాబును మళ్లీ సీఎంను చేయడంపై మాట్లాడాలని సూచన
  • కాలువ శ్రీనివాస్, మరో వ్యక్తి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపణ
JC Prabhakar Reddy controversial comments on TDP Meet

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ జిల్లాల తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహించిన సదస్సులో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సమావేశం జరుగుతుండగానే బయటకు వచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హంద్రీనీవా, టీఎంసీలు అంటే ఎవరికీ అర్ధం కాదని అన్నారు. హంద్రీనీవా గురించి కాదని, చంద్రబాబును మళ్లీ ఎలా ముఖ్యమంత్రిని చేయాలో మాట్లాడాలని అన్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన లోకేశ్‌నే అరెస్ట్ చేశారని గుర్తు చేసిన ఆయన.. జిల్లా నాయకులు రెండు హంద్రీనీవా కాలువలను సందర్శించినా ఏమీ చేయలేదంటే ఏదో లోపాయికారీ ఒప్పందం కుదిరితే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే మనందరినీ లోపలేసేవారేనని పేర్కొన్నారు. నిజానికి ఈ సమావేశం సరైంది కానే కాదన్నారు. సమావేశం గురించి కార్యకర్తలకు, మాజీలకు చెప్పారా? అని ప్రశ్నించారు. ఇదంతా కాలువ శ్రీనివాస్, మరో వ్యక్తి కనుసన్నల్లోనే జరుగుతోందని విమర్శించిన జేసీ.. ‘‘చంద్రబాబు సర్.. కార్యకర్తలను మేం సరిగ్గా చూసుకోవడం లేదు’’ అని అనడం కలకలం రేపింది.

More Telugu News