అనంతపురంలో విషాదం.. గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మరణించిన యువకుడు!

12-09-2021 Sun 10:11
  • స్థానిక గౌతమిపురి కాలనీలో ఘటన
  • డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు
  • గుండెపోటు రావడంతో మృతి చెందాడన్న వైద్యులు
Young Boy died while dancing at Ganesh mandapam in Guthi anantapur dist

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తున్న ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. గణేశ్ నవరాత్రులను పురస్కరించుకుని గుత్తిలోని స్థానిక గౌతమిపురి కాలనీలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఓ యువకుడు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోనే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు.