Saitej: సాయితేజ్ వాడింది సెకండ్ హ్యాండ్ బైక్: మాదాపూర్ డీసీపీ

Hyderabad police statement on Saitej bike accident
  • సాయితేజ్ ప్రమాదంపై పోలీసుల ప్రకటన
  • 78 కిమీ వేగంతో వెళుతున్న సాయితేజ్
  • అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి బైక్ కొన్న సాయితేజ్
  • గతంలో ఈ బైక్ కు ఓవర్ స్పీడ్ చలాన్
సినీ హీరో సాయితేజ్ రోడ్డు ప్రమాద ఘటనపై హైదరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. సాయితేజ్ ప్రమాదానికి గురైన సమయంలో బైక్ పై 78 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

సాయితేజ్ వాడిన బైక్ సెకండ్ హ్యాండ్ దని వివరించారు. ఎల్బీ నగర్ కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి ఈ బైక్ ను కొనుగోలు చేశారని తెలిపారు. ఘటనా స్థలంలో లభ్యమైన బైక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అనిల్ కుమార్ ను పిలిపించి విచారిస్తున్నామని వెల్లడించారు.

బైక్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తికాలేదని డీసీపీ వివరించారు. బైక్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని పేర్కొన్నారు. గతంలో మాదాపూర్ లోని పర్వతాపూర్ వద్ద ఓవర్ స్పీడ్ వెళ్లినందుకు ఈ బైక్ కు రూ.1,035 చలాన్ వేశారని తెలిపారు. ఆ చలాన్ ను సాయితేజ్ అభిమాని ఒకరు ఇవాళ చెల్లించారని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
Saitej
Bike Accident
Police
Hyderabad

More Telugu News