'బ్యాచ్ లర్' నుంచి వస్తున్న లిరికల్ వీడియో!

11-09-2021 Sat 18:58
  • 'బ్యాచ్ లర్' గా అఖిల్
  • కథానాయికగా పూజ హెగ్డే
  • ఈ నెల 15వ తేదీన లిరికల్ వీడియో
  • అక్టోబర్ 8వ తేదీన సినిమా రిలీజ్ 
Most Eligible Bachelor movie update

అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా రూపొందింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి చాలా కాలమే అయినా, కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా నుంచి, ఈ నెల 15వ తేదీన ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గోపీసుందర్ అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

అఖిల్ సరసన నాయికగా పూజ హెగ్డే నటించగా, మరో కథానాయిక పాత్రలో ఈషా రెబ్బా మెరవనుంది. ఆమని .. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ కు, ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.