నొప్పిగా ఉందన్న సాయిధరమ్ తేజ్!

11-09-2021 Sat 18:04
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్
  • కుటుంబసభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించిన వైద్యులు
  • 'నొప్పిగా ఉంది' అనే ఒక్క మాట మాట్లాడినట్టు వైద్యుల వెల్లడి
Sai Dharam Tej speaks one word in hospital

మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జ్ పై ప్రమాదానికి గురైన సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పృహ కోల్పోయిన ఆయన... స్పృహలోకి వచ్చారు. ఐసీయూలో ఉన్న సాయితేజ్ ను వీడియో కాల్ ద్వారా కుటుంబసభ్యులతో మాట్లాడించే ప్రయత్నాన్ని వైద్యులు చేశారు.

ఈ సందర్భంగా 'నొప్పిగా ఉంది' అంటూ సాయితేజ్ ఒకే ఒక మాట మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ ఒక్క మాట మినహా ఆయన మరేం మాట్లాడలేదని... మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని డాక్టర్లు తెలిపారు. సాయితేజ్ దగ్గరకు కుటుంబసభ్యులను కూడా డాక్టర్లు అనుమతించడం లేదు. మరోవైపు సాయితేజ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.