చిరకాల కోరిక తీర్చుకున్న నీరజ్ చోప్రా

11-09-2021 Sat 17:47
  • తల్లిదండ్రులను విమానంలో తీసుకెళ్లాలనేది నీరజ్ చోప్రా కోరిక
  • తాజాగా వారిని విమానం ఎక్కించిన నీరజ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
Neeraj Chopra fulfills his dream

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకాన్ని అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. తన తల్లిదండ్రులను తొలిసారి విమానంలో తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసి పొంగిపోయాడు. ఈ విషయాన్ని నీరజ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

తన తల్లిదండ్రులను విమానంలో తీసుకెళ్లానని... తన చిరకాల కోరిక నెరవేరిందని చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నీరజ్ ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు అత్యున్నత స్థాయికి చేరుకుని అన్ని కలలను నెరవేర్చుకోవాలని నెటిజన్లు అంటున్నారు. ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్ లో 87.58 మీటర్లు విసిరి నీరజ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు.