దూసుకుపోతున్న 'ఖిలాడి' సాంగ్!

11-09-2021 Sat 17:34
  • రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ 
  • నిన్న రిలీజైన లిరికల్ సాంగ్
  • దేవిశ్రీ మెలోడీకి మంచి మార్కులు
  • 24 గంటల్లో 3 మిలియన్ కి పైగా వ్యూస్  
Huge likes for khiladi song

రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా, విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వినాయకచవితి పండుగ సందర్భంగా నిన్న ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ను యు ట్యూబ్ లో ఇలా వదిలారో లేదో అలా దూసుకుపోయింది. 24 గంటల్లోనే ఈ పాటకు 3 మిలియన్ కి పైగా వ్యూస్ .. 110K లైక్స్ లభించడం విశేషం. రవితేజ - డింపుల్ హయతిపై ఈ మెలోడీ సాంగ్ ను చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం బాగున్నాయి. హరిప్రియ గానం ఆకట్టుకునేలా సాగింది.

రవితేజ సరసన మరో కథానాయికగా మీనాక్షి చౌదరి నటించగా, ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు. ఇక ఇతర కీలకమైన పాత్రలను సచిన్ కేడ్కర్ .. ఉన్ని ముకుందన్ .. ముఖేశ్ రుషి .. రావు రమేశ్ .. అనసూయ పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.