రేపు సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్స!

11-09-2021 Sat 17:31
  • రోడ్డు ప్రమాదంలో సాయితేజ్ కు తీవ్ర గాయాలు
  • అదుపు తప్పిన స్పోర్ట్స్ బైకు
  • జారిపడిన సాయితేజ్
  • ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స
Saitej will undergo an important surgery

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయితేజ్ ప్రస్తుతం హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఉదయం నుంచి సాయితేజ్ కు పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. కాగా, సాయితేజ్ స్పోర్ట్స్ బైకు నుంచి కిందపడిన ప్రమాదంలో కాలర్ బోన్ కు బలమైన దెబ్బ తగిలినట్టు వైద్యులు గుర్తించారు. రేపు సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్స చేయనున్నారు.

మెడికవర్ ఆసుపత్రి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించిన సమయంలో సాయితేజ్ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడడంతో వెంటనే ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం సాయితేజ్ సాఫీగా శ్వాస తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.