Vijay Rupani: తన రాజీనామా వెనుక కారణాన్ని వెల్లడించిన విజయ్ రూపానీ

  • గుజరాత్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం
  • గవర్నర్ కు రాజీనామా పత్రం అందజేత
  • అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నది బీజేపీ  సిద్ధాంతం 
  • అందుకు అనుగుణంగానే రాజీనామా చేశానన్న రూపానీ   
Vijay Rupani said why he resigned as CM

గుజరాత్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను నెరవేర్చానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నది బీజేపీ అధిష్ఠానం సిద్ధాంతమని, అందుకు అనుగుణంగానే తాను రాజీనామా చేశానని రూపానీ వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. సీఎంగా గుజరాత్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, వచ్చే ఎన్నికల్లోనూ మోదీ నాయకత్వంలో తమదే విజయం అని ఉద్ఘాటించారు. సీఎం ఎవరైనా మోదీ మార్గదర్శనంలో పనిచేస్తామని రూపానీ స్పష్టం చేశారు. గుజరాత్ బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలసికట్టుగానే ఉన్నామని అన్నారు.

విజయ్ రూపానీ 2016 నుంచి గుజరాత్ సీఎంగా ఉన్నారు. అటు, వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, కొత్త సీఎంతో ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ యోచనగా కనిపిస్తోంది. నూతన ముఖ్యమంత్రి రేసులో మన్సుఖ్ మాండవీయ (ప్రస్తుత కేంద్రమంత్రి),నితిన్ పటేల్ (గుజరాత్ డిప్యూటీ సీఎం), ఆర్సీ ఫాల్దు (గుజరాత్ మంత్రి) ఉన్నారు.

More Telugu News