తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

11-09-2021 Sat 16:31
  • తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం
  • అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొన్న కారు
  • బాధితులు మెదక్ జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
One dead in Tirumala ghat road accident

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం సంభవించింది. మొదటి కనుమదారిలో కొండ మీద నుంచి కిందకు వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మరో 3 కిలోమీటర్ల దూరంలో తిరుపతి ఉన్న తరుణంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శివలింగం అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

గాయపడిని వారిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కారు అదుపుతప్పి పక్కనున్న రెయిలింగ్ ను ఢీకొనడం వల్లే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారిని తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.