ముంబయిలో దారుణరీతిలో అత్యాచారానికి గురైన మహిళ మృతి

11-09-2021 Sat 16:26
  • ముంబయిలో నిర్భయ తరహా ఘటన
  • మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారం
  • క్రూరంగా హింసించిన వైనం
  • తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో మహిళ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
Mumbai woman who was raped dies of severe injuries

నిర్భయ తరహాలో ముంబయిలో ఓ మహిళ దారుణంగా అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. సాకినాకా ప్రాంతంలో జరిగిన ఈ హేయమైన ఘటన దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

శుక్రవారం ఓ మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు, ఆమెను క్రూరంగా హింసించారు. ఇనుపరాడ్డును ఆమె మర్మాంగంలోకి చొప్పించడంతో తీవ్రరక్తస్రావమైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను గట్కోపర్ రాజావాడి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కాగా, ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజి కీలకం కానుంది. ఈ ఘటన అనంతరం ఓ వ్యక్తి టెంపోలో పారిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం కూడా ఉందని భావిస్తున్నారు.