ముగ్గురికి ఉరిశిక్ష విధించామని సుచరిత తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కొల్లు రవీంద్ర

11-09-2021 Sat 13:36
  • రమ్య హత్య కేసులో ఇంత వరకు న్యాయం జరగలేదు
  • రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమయింది
  • పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారు
Sucharita is making false propaganda that the three have been hanged says Kolly Ravindra

ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. రమ్య హత్య ఘటన జరిగి 21 రోజులు అయినా ఇంత వరకు న్యాయం జరగలేదని దుయ్యబట్టారు. దిశ చట్టం ద్వారా ఇప్పటి వరకు ముగ్గురికి ఉరిశిక్ష పడేలా చేశామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమయిందని అన్నారు. డీజీపీ సహా చాలా మంది పోలీసు అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కు తొత్తులుగా వ్యవహరించడాన్ని పోలీసులు మానుకోవాలని... లేకపోతే ప్రజలు ఏదో ఒకరోజు తిరగబడతారని హెచ్చరించారు.