కోహ్లీ, సిరాజ్ ల కోసం ప్రత్యేక ఫ్లైట్ ను సిద్ధం చేసిన ఆర్సీబీ

11-09-2021 Sat 11:32
  • ముగిసిన ఇంగ్లండ్-ఇండియా సిరీస్
  • ఐపీఎల్ కోసం యూఏఈకి బయల్దేరుతున్న భారత ఆటగాళ్లు
  • ప్రత్యేక విమానంలో ఈ రాత్రి దుబాయ్ కు వెళ్తున్న కోహ్లీ, సిరాజ్
RCB arraged special flight for Kohli and Siraj

ఇంగ్లండ్ తో జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. మరోవైపు ఐపీఎల్ సీజన్-14 రెండో అంచె పోటీలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇంగ్లండ్ నుంచి ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ సిరాజ్ ల కోసం ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ సిద్ధం చేసింది. వీరిద్దరినీ తీసుకుని విమానం యూఏఈ చేరుకుంటుంది. ఈ రాత్రి వీరిద్దరూ విమానం ఎక్కనున్నారు. దుబాయ్ లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్ లో ఉంటారు.