RP Patnaik: నటుడు సాయితేజ్ పైనే కాదు.. రోడ్డు నిర్మించిన కంపెనీపైన, మునిసిపాలిటీపైనా కేసులు పెట్టాలి: ఆర్పీ పట్నాయక్

Not Only sai tej also book cases against construction company and municipality
  • సాయితేజ్ త్వరగా కోలుకోవాలి
  • నటుడి బైక్ స్కిడ్ కావడానికి రోడ్డుపైన ఇసుకే కారణమన్న పోలీసులు
  • ఒకసారి కేసులు పెడితే జాగ్రత్త పడతారన్న ఆర్పీ
టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన.. అతడిపై నమోదైన పోలీసు కేసు గురించి స్పందించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్టు సాయితేజ్‌పై కేసు పెట్టినట్టుగానే, రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్ కంపెనీపైనా, ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేయకుండా ఇసుక పేరుకుపోయేందుకు కారణమైన మునిసిపాలిటీపైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఒకసారి ఇలా కేసులు పెడితే మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడతారని ఆర్పీ ట్వీట్ చేశారు. కాగా, సాయి నడుపుతున్న బైక్ స్కిడ్ కావడానికి రోడ్డుపైనున్న ఇసుకే కారణమని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. స్కిడ్ అయిన బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పిన విషయం తెలిసిందే.
RP Patnaik
Tollywood
Sai Dharam Tej
Road Accident

More Telugu News