సాయితేజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి

11-09-2021 Sat 11:00
  • సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది
  • అన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నాం
  • ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తాం
Sai Dharam Tej health condition is steady says Apollo hospitals JMD Sangeetha Reddy

సీనీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తలకు బలమైన గాయాలు లేవని, వెన్నుపూసకు ఎలాంటి దెబ్బ తగల్లేదని వెల్లడించారు. అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్నాయని చెప్పారు. అన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తామని తెలిపారు.

నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతివేగమే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు. మరోవైపు రోడ్డుపై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయిందని అంటున్నారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.