గోవాలో 'అఖండ' షూటింగ్!

11-09-2021 Sat 10:56
  • ముగింపు దశలో 'అఖండ'
  • గోవాలో చివరి షెడ్యూల్
  • ప్రతినాయకుడిగా శ్రీకాంత్
  • దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్      
Acharya movie shooting update

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ 'అఖండ' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకు చేరుకుంది. ఇటీవలే పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేశారు. తాజా షెడ్యూల్ ను 'గోవా'లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగు మొదలవుతుందట.

ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఆ తరువాత మిగతా పనులను చకచకా పూర్తి చేసి, అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు.

రైతుగా .. అఘోరగా బాలకృష్ణ విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో, ప్రగ్యా జైస్వాల్ .. పూర్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.