లారీని అడ్డగించి రూ. 7 లక్షలు దోచేసిన దుండగులు.. కృష్ణా జిల్లాలో ఘటన

11-09-2021 Sat 10:09
  • మైలవరం మండలంలోని పుల్లూరు సమీపంలో ఘటన
  • లారీ పుల్లూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా అడ్డగింత
  • నిందితులు ఖమ్మం వాసులుగా గుర్తింపు
Rs 7 lakhs stolen by lorry driver in krishn dist

కృష్ణా జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. ఓ లారీని అడ్డగించిన దుండగులు డ్రైవర్‌ను బెదిరించి రూ. 7 లక్షల రూపాయలు తీసుకుని పరారయ్యారు. మైలవరం మండలంలోని పుల్లూరు సమీపంలో జరిగిందీ ఘటన. లారీ పుల్లూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా దారికాచి అడ్డగించిన దుండగులు డ్రైవర్‌ను బెదిరించారు. అతడి వద్దనున్న సొత్తును లాక్కుని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఖమ్మం వాసులుగా గుర్తించారు.