ముంబైలో దారుణం.. 32 ఏళ్ల మహిళపై పాశవికంగా అత్యాచారం

11-09-2021 Sat 08:23
  • ముంబైలోని సకినాక ప్రాంతంలో ఘటన 
  • ప్రధాన నిందితుడి అరెస్ట్
  • మరికొందరు అనుమానితుల కోసం పోలీసుల వేట
Mumbai woman raped and one arrested

ముంబైలోని సకినాక ప్రాంతంలో అత్యంత దారుణం జరిగింది. 32 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు అత్యంత పాశవిక చర్యకు పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు భాగాల్లోకి ఇనుప రాడ్డు చొప్పించారు. పోలీసుల కథనం ప్రకారం.. సకినాక ప్రాంతంలోని ఖైరానీ రోడ్డులో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు నిన్న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

రోడ్డు పక్కన పడివున్న మహిళను గుర్తించి ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు రహస్య భాగంలోకి రాడ్డును చొప్పించినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందని అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.