నటుడు సాయి ధరమ్‌తేజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

11-09-2021 Sat 06:54
  • నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్‌పై కేసు
  • అతి వేగమే ప్రమాదానికి కారణం
  • ప్రమాద సమయంలో హెల్మెట్‌తోనే నటుడు
Police case filed against sai dharam tej

నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. నిన్న రాత్రి 8.05 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై 108 సిబ్బంది తమకు సమాచారం అందించినట్టు చెప్పిన పోలీసులు ఘటనా స్థలం నుంచి స్పోర్ట్స్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బైక్‌పై వేగంగా వెళ్తుండడంతో నియంత్రించలేక అదుపుతప్పి కిందపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారని మాదాపూర్ డీసీపీ తెలిపారు.