మొక్కల్లోంచి మీదకు దూకిన పాము.. వెర్రికేకలేస్తూ ఇంట్లోకి యువతి పరుగులు

  • వీడియో షేర్ చేసిన టెక్సాస్ యువతి
  • ఇంటి ముందు మొక్కల్లోంచి మీదకు దూకిన పాము
  • సీసీకెమెరాలో రికార్డయిన వీడియో
snake jumps out on a woman she screams and rushes into house

ఇంట్లో నుంచి ఏదో పనిమీద బయటకు వెళ్లడానికి బయటకు వచ్చింది చాన్వా లెకాంప్టే అనే యువతి. టెక్సాస్‌కు చెందిన ఆమె ఇంట్లో నుంచి అలా బయటకు వచ్చిందో లేదో.. తలుపు పక్కన పెట్టిన మొక్కల కుండీల మధ్య నుంచి ఒక పాము బుస్సుమంటూ ముందుకు దూకింది. కొంచెం ఉంటే ఆమెపై దూకేసేదే! ఆ పామును చూసిన చాన్వా.. వెర్రికేక పెడుతూ ఇంట్లోకి పరుగుతీసింది.

ఇంటి ముందున్న సీసీకెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన చాన్వా.. పాము అలా ముందుకు దూకగానే భయంతో చచ్చినంత పనైందని చెప్పింది. ఆమె ఇంట్లోకి వెళ్లగానే ఆ పాము మళ్లీ ఆ మొక్కల్లోకే వెళ్లిపోయినట్లు వీడియోలో కనబడుతోంది.

ఆమె ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ‘భయంకరంగా’ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘నేనైతే చచ్చిపోయేవాడిని’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. మరికొందరు ఆమె ప్రమాదం నుంచి తప్పించుకున్నందుకు సంతోషం వ్యక్తంచేశారు.

More Telugu News