హీరో సాయితేజ్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు

10-09-2021 Fri 22:10
  • స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిన సాయితేజ్
  • గచ్చిబౌలి నుంచి వస్తుండగా ప్రమాదం
  • ఐకియా జంక్షన్ వద్ద ఘటన
  • మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స
Hero Saitej hospitalized after severely injured in road accident

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాదులో సాయితేజ్ స్పోర్ట్స్ బైక్ పై వెళుతుండగా ఐకియా జంక్షన్ వద్ద కిందపడ్డారు. గచ్చిబౌలి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సాయితేజ్ కు తీవ్రగాయాలు తగిలినట్టు తెలుస్తోంది. ఆయనను హుటాహుటీన మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. సాయితేజ్ ను ఆసుపత్రికి తరలించిన సమయంలో అపస్మారక స్థితిలో ఉన్నట్టు అందుబాటులో ఉన్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.