వార్నర్ పై సన్ రైజర్స్ చేసిన ట్వీట్ కు స్పందించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం

10-09-2021 Fri 20:02
  • యూఏఈ వేదికగా ఐపీఎల్-14 మిగిలిన భాగం
  • సెప్టెంబరు 19న ప్రారంభం
  • సన్నాహాల్లో మునిగితేలుతున్న ఫ్రాంచైజీలు
  • సన్ రైజర్స్ ఆటగాళ్ల సాధన
  • వార్నర్ సాధన గురించి చెబుతూ WARNERRR అంటూ ట్వీట్ 
RRR movie unit responds to Sunrisers tweet on David Warner

మరికొన్నిరోజుల్లో యూఏఈ గడ్డపై ఐపీఎల్ కోలాహలం ప్రారంభం కానుంది. భారత్ లో నిలిచిపోయిన ఐపీఎల్-14 సీజన్ ను యూఏఈ వేదికగా పూర్తిచేయనున్నారు. ఈ పోటీలు ఈ నెల 19 నుంచి షురూ అవుతాయి. అందుకు మరికొన్నిరోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్రాంచైజీలన్నీ ఈపాటికే యూఏఈ చేరుకుని సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కూడా నెట్స్ లో చెమటోడ్చుతున్నారు.

డాషింగ్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సాధన చేస్తుండగా, దీనిపై సన్ రైజర్స్ యాజమాన్యం ఓ ట్వీట్ చేసింది. వార్నర్ ఇదిగో ఇలా... అంటూ వార్నర్ (WARNERRR) అనే పదంలో మూడు ఆర్ లను పేర్కొంది. దీనిపై ఆర్ఆర్ఆర్ చిత్రబృందం స్పందించింది. తాము కూడా వార్నర్ అన్న మాస్ షో కోసం వేచిచూస్తున్నామని బదులిచ్చింది. ఈ సరదా సంభాషణకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.