'భళా తందనాన' నుంచి కేథరిన్ లుక్ రిలీజ్!

10-09-2021 Fri 18:19
  • శ్రీ విష్ణు హీరోగా 'భళా తందనాన'
  • శశిరేఖ పాత్రలో కేథరిన్ 
  • విలన్ గా 'గరుడ' రామ్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
Catherine birthday poster released

తెలుగు తెరకి కేథరిన్ పరిచయమై చాలాకాలమే అయింది. అందాల కథానాయికగా ఆమెను అభిమానించేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 'సరైనోడు' .. 'నేనే రాజు నేనే మంత్రి' వంటి సూపర్ హిట్లు పడినప్పటికీ, ఎందుకనో ఆమె కెరియర్ పుంజుకోలేదు. అయినా పట్టువిడవకుండా ఆమె తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది.

ఆమె తాజా చిత్రంగా 'భళా తందనాన' సినిమా రూపొందుతోంది. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున కేథరిన్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆమెకు శుభాకాంక్షలు అందజేసింది. ఆమె పాత్ర పేరు 'శశిరేఖ' అనే విషయాన్ని రివీల్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

వారాహి బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా 'గరుడ' రామ్ కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా కేథరిన్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.