ఈ నెల 24వ తేదీన 'లవ్ స్టోరీ' .. అధికారిక ప్రకటన!

10-09-2021 Fri 17:02
  • చైతూ జోడీగా సాయిపల్లవి
  • సున్నితమైన భావోద్వేగాలతో సాగే కథ  
  • వాయిదా పడుతూ వచ్చిన సినిమా
  • సంగీత దర్శకుడిగా పవన్ సీహెచ్
Love Story release date is confirmed

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ప్రేమకథల్లోని ప్రేమికులు పెద్దలను ఎదిరించరు .. కట్టుబాట్లను అతిక్రమించరు. కుటుంబం .. విలువల చుట్టూనే వారి ప్రేమ తిరుగుతుంది. ఇక ప్రేయసీ ప్రియుల పాటల్లో కూడా ప్రేమ .. ఆరాధన తప్ప కోరికల తాలూకు మాటలు ఎక్కడా వినిపించవు.

అందువల్లనే శేఖర్ కమ్ముల సినిమాల కోసం యూత్ ఎంతగా ఎదురుచూస్తూ ఉంటుందో .. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంతే ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన 'లవ్ స్టోరీ' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను ఈ రోజున రిలీజ్ చేద్దామనుకుని, మళ్లీ వాయిదా వేసుకున్నారు.

తాజాగా ఈ సినిమాకి మరో రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. పవన్ సీహెచ్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలం అనే టాక్ వినిపిస్తోంది.