నారా లోకేశ్ పై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు

10-09-2021 Fri 16:51
  • నిన్న గన్నవరం వచ్చిన లోకేశ్
  • నరసరావుపేట వెళ్లేందుకు ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Krishnalanka police files cases against Nara Lokesh

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న నరసరావుపేటలో పర్యటించేందుకు గన్నవరం వచ్చిన లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. అయితే, కొవిడ్ నిబంధనల అతిక్రమణ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడం వంటి ఆరోపణలపై లోకేశ్ మీద కేసు నమోదు చేశారు. సెక్షన్ 186, 341, 269 కింద ఈ కేసు నమోదు చేశారు.

నిన్న గన్నవరం వచ్చిన లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. కొన్నినెలల కిందట గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష హత్యకు గురైంది. ఆమె కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్ భావించినా, పోలీసులు అడ్డుకోవడంతో చివరికి వీడియో కాల్ ద్వారా అనూష కుటుంబ సభ్యులతో మాట్లాడారు.