ఖైరతాబాద్ మహా గణపతికి తొలిపూజ చేసిన తెలంగాణ, హర్యానా గవర్నర్లు

10-09-2021 Fri 14:35
  • ఖైరతాబాద్ లో పంచముఖ మహాగణపతి విగ్రహం ఏర్పాటు
  • విగ్రహం ఎత్తు 40 అడుగులు
  • ఖైరతాబాద్ విచ్చేసిన తమిళిసై, దత్తాత్రేయ
Telangana and Haryana governors offers first prayers to Khairatabad Maha Ganapathi

ఖైరతాబాద్ లో ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ విగ్రహం ఎత్తు 40 అడుగులు. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఖైరతాబాద్ గణపతికి నేడు వినాయకచవితి సందర్భంగా తొలిపూజ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విఘ్నవినాయకుడికి తొలిపూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ, కరోనా పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేశారు.

అటు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలోనూ గణేశుడికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేత విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.