అఖిల్ సినిమాతో నటిగా చిన్మయి ఎంట్రీ!

10-09-2021 Fri 12:00
  • ఈ రోజున చిన్మయి బర్త్ డే
  • డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు
  • సమంతకు ఎక్కువగా డబ్బింగ్ చెప్పిన చిన్మయి
  • ఇద్దరి మధ్య మంచి స్నేహం
  • 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో ఎంట్రీ
Chinmayi entry in Akhil movie

చిన్మయి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ .. అంతకు మించి గాయని అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తెలుగు .. తమిళ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా ఆమె చాలా బిజీ. తెలుగులో సమంతకు చిన్మయి ఎక్కువగా డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. ఆమె వాయిస్ విన్నవారు సమంత తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పిందని అనుకుంటారు. చిన్మయి వాయిస్ అంతగా సమంత వాయిస్ కి దగ్గరగా .. సహజంగా అనిపిస్తుంది.

అందువలన ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తన సక్సెస్ లో సగభాగం చిన్మయిదేనని సమంత తరచూ చెబుతూనే ఉంటుంది. ఇంతవరకూ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా తెరవెనుక మాత్రమే ఉంటూ వచ్చిన చిన్మయి, అఖిల్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో నటిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజున చిన్మయి పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఈ విషయాన్ని రివీల్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇకపై చిన్మయి నటిగా కూడా కంటిన్యూ అవుతుందేమో చూడాలి.