'ఖిలాడి' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్!

10-09-2021 Fri 11:38
  • రమేశ్ వర్మ నుంచి 'ఖిలాడి'
  • రవితేజ జోడీగా ఇద్దరు భామలు
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
Khiladi first single released

రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ 'ఖిలాడి' సినిమాను రూపొందించాడు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలో, రవితేజ సరసన డింపుల్ హయతి - మీనాక్షి చౌదరి నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి, ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

'చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం' అంటూ ఈ పాట సాగుతోంది. రవితేజ - డింపుల్ పై చిత్రీకరించిన ఈ పాట బీట్ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన .. శ్రీమణి అందించిన సాహిత్యం .. హరిప్రియ ఆలాపన మనసుకు పట్టుకుంటున్నాయి. హీరో పట్ల తన మనసులోని భావాలను హీరోయిన్ ఆవిష్కరించే తీరు కొత్తగా .. ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.