మ‌హేశ్ బాబు 'దూకుడు' సినిమా డైలాగు చెప్పిన కైఫ్‌.. వీడియో ఇదిగో

10-09-2021 Fri 11:37
  • యూట్యూబ్ కు కైఫ్ ఇంట‌ర్వ్యూ
  • డైలాగు చెప్పించిన యూట్యూబ‌ర్
  • అద్భుతంగా చెప్పాడంటోన్న మ‌హేశ్ ఫ్యాన్స్
kaif video goes viral

టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ తాజాగా టాలీవుడ్ హీరో మ‌హేశ్ బాబు డైలాగును చెప్పి అల‌రించాడు. కైఫ్‌ను ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ సంద‌ర్భంగా కైఫ్‌తో ఇంట‌ర్వ్యూ చేస్తోన్న వ్య‌క్తి ఈ డైలాగు చెప్పించాడు. శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన సూప‌ర్‌హిట్ సినిమా 'దూకుడు' సినిమాలోని 'మైండ్ లో ఫిక్స‌యితే బ్లైండ్ గా వెళ్లిపోతా' డైలాగు చెప్పాల‌ని కైఫ్‌ను ఇంటర్వ్యూ చేసే వ్య‌క్తి కోరాడు.

దీంతో కైఫ్ ఈ డైలాగు చెప్పాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. కైఫ్ చెప్పిన డైలాగు మ‌హేశ్ బాబు అభిమానుల‌ను ఖుషీ చేస్తోంది. అద్భుతంగా డైలాగు చెప్పి 'దూకుడు' సినిమాను మ‌రోసారి గుర్తు తెచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.