చిరూ కోసం 'శంకర్ దాదా' తరహాలో కథ రెడీ చేస్తున్న మారుతి?

10-09-2021 Fri 11:08
  • ఇటీవల చిరూను కలిసిన మారుతి
  • లైన్ ఓకే చేయించుకున్నాడనే టాక్
  • పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో బిజీ
  • యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో కలిసి నడిచే కథ
Maruthi another movie with Chiranjeevi

ఒక వైపున యూత్ ను .. మరో వైపున మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు ఎలా రప్పించాలనేది దర్శకుడు మారుతికి బాగా తెలుసు. కథలో ఏయే అంశాలు ఏ పాళ్లలో కలపాలనే విషయంలో ఆయన సిద్ధహస్తుడు.

ప్రస్తుతం ఆయన  గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిరంజీవిని మారుతి కలిశాడు. ఆయన చిరంజీవికి ఒక లైన్ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. లైన్ నచ్చడంతో .. పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని చిరూ అన్నారన్నట్టుగా చెప్పుకున్నారు.

ఇక అప్పటి నుంచి ఈ విషయం మరింత బలపడుతూ వెళుతోంది. 'శంకర్ దాదా' తరహాలో సాగే కథను మారుతి సిద్ధం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి కమిటైన ప్రాజెక్టులు పూర్తికాగానే, ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.