రుణాలు తిరిగి చెల్లించని కేసు.. కేంద్రమంత్రి భార్య, కుమారులపై లుక్ అవుట్ నోటీసులు

10-09-2021 Fri 09:41
  • నారాయణ్‌రాణె, ఆయన భార్య, కుమారుడిపై లుక్ అవుట్ నోటీసుల జారీ
  • తీసుకున్న రుణాల్లో రూ. 60 కోట్ల ఎగవేత
  • కేంద్రం నుంచి అందిన ఆదేశాలతో మహారాష్ట్ర లుక్ అవుట్ నోటీసులు
Lookout Circulars Issued For Minister Narayan Ranes Wife Son In Loan Case

కేంద్రమంత్రి నారాయణ్ రాణె, ఆయన భార్య నీలమ్, ఎమ్మెల్యే అయిన వారి కుమారుడు నీతేశ్‌ దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఓ ఫైనాన్షియల్ సంస్థ నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేసినట్టు పూణె పోలీసు అధికారులు తెలిపారు.

నీలమ్, నీతేశ్‌లు తమకు చెందిన వివిధ సంస్థల తరపున ఓ ఫైనాన్షియల్ సంస్థ నుంచి తీసుకున్న రుణాల్లో దాదాపు రూ. 60 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. రుణాలు పొందిన సమయంలో చూపిన రుణాల ఖాతాలను నిరర్థక ఆస్తులుగా పేర్కొనడంతో రుణాలిచ్చిన సంస్థ కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఆదేశాలతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఘాడ్జ్ తెలిపారు.