33 మంది సెలబ్రిటీలు ఒకేసారి రిలీజ్ చేసిన 'ఏనుగు' ఫస్టులుక్!

09-09-2021 Thu 18:53
  • హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్
  • యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
  • కథానాయికగా ప్రియా భవాని శంకర్  
  • కీలక పాత్రల్లో సముద్రఖని .. రాధిక
Enugu first look released

సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్, హీరోగా ... విలన్ గా తన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఏనుగు' రూపొందుతోంది. 'సింగం' సిరీస్ తో మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరి, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను విడుదల చేశారు. డిఫరెంట్ మీసకట్టుతో అరుణ్ విజయ్ ఈ పోస్టర్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇది యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ అనే విషయాన్ని హరి ఫస్టులుక్ తోనే చెప్పేశాడు.

33 మంది సెలబ్రిటీలతో ఒకే సమయంలో ఈ ఫస్టులుక్ ను విడుదల చేయించడం విశేషం. శక్తివేల్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ప్రియా భవాని శంకర్ .. అమ్ము అభిరామి కథనాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో, సముద్రఖని .. రాధిక .. యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.