తప్పతాగి ఆర్మీ వాహనం ఎదుట యువతి వీరంగం... వీడియో ఇదిగో!

  • మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఘటన
  • పడావో చౌక్ లో యువతి వీరంగం
  • ఆర్మీ వాహనాన్ని తన్నుతూ హంగామా
  • వీడియో వైరల్
Drunk woman creates ruckus on road in Gwalior

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ యువతి మద్యం మత్తులో రోడ్డుపై హంగామా సృష్టించింది. ఆధునిక వస్త్రధారణలో ఉన్న ఆ యువతి మద్యం సేవించి పడావో చౌక్ రోడ్డుపైకి వచ్చింది. అటుగా వెళుతున్న ఆర్మీ వాహనాన్ని ఆపేసి, కాలితో ఆ వాహనాన్ని ఇష్టం వచ్చినట్టు తన్నింది. అడ్డొచ్చిన ఆర్మీ అధికారిపైనా జులుం ప్రదర్శించింది.

ఈ తతంగాన్ని ఇతర వాహనదారులు చోద్యం చూశారే తప్ప, ఎవరూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చివరికి ఆమే పక్కకి జరగడంతో ఆర్మీ సిబ్బంది తమ వాహనంతో అక్కడ్నించి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

More Telugu News