టీమిండియా సహాయకబృందంలో మరొకరికి కరోనా... క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు

09-09-2021 Thu 17:23
  • ఇటీవల రవిశాస్త్రి సహా ముగ్గురికి కరోనా
  • తాజాగా మరోసారి కరోనా కలకలం
  • ఆటగాళ్లకు కరోనా పరీక్షలు
  • రేపటి నుంచి ఇంగ్లండ్ తో ఐదో టెస్టు
One more person tested corona positive in Team India

ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా బారినపడడం తెలిసిందే. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే టీమిండియా సహాయక బృందంలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు.

ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. రేపు ఇంగ్లండ్ తో ప్రారంభయ్యే చివరిదైన ఐదో టెస్టులో కోహ్లీ సేన నేరుగా బరిలో దిగనుంది. తాజా కరోనా కలకలం నేపథ్యంలో టీమిండియా సభ్యులందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.