Ambedkar: హుస్సేన్ సాగర్ తీరంలో రూ.100 కోట్లతో అంబేద్కర్ భారీ విగ్రహం

  • విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన
  • మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్
  • టెండర్లు పిలవనున్నట్టు వెల్లడి
  • 15 నెలల్లోపు విగ్రహ నిర్మాణం పూర్తి!
Huge Ambedkar statue at Hussain Sagar in Hyderabad

రాష్ట్రంలోని దళితులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. హైదరాబాదు నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో రూ.100 కోట్లతో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. దీనికోసం రూ.100 కోట్లకు టెండర్లు పిలవాలని టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది.

ఈ అంబేద్కర్ మహా విగ్రహం గురించిన వివరాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాకు తెలిపారు. ఈ విగ్రహం కిందిభాగంలో 50 అడుగుల మేర పార్లమెంటు ఆకృతిలో ఓ భవంతి ఉంటుందని, దానిపైన విగ్రహ నిర్మాణం ఉంటుందని వివరించారు. గరిష్ఠంగా 15 నెలల కాలంలో ఈ విగ్రహం నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అంబేద్కర్ గొప్పదనాన్ని ప్రతిబింబించేలా విగ్రహ నిర్మాణం ఉంటుందని వివరించారు. విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.

More Telugu News