Air Strip: హైవేపై ప్రయోగాత్మకంగా ల్యాండింగ్... విమానంలో రాజ్ నాథ్, గడ్కరీ!

  • దేశవ్యాప్తంగా హైవేలపై ఎయిర్ స్ట్రిప్ ల నిర్మాణం
  • అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి ఎయిర్ స్ట్రిప్ లు
  • రాజస్థాన్ లోని బాద్మేర్ హైవే ఎయిర్ స్ట్రిప్ ప్రారంభోత్సవం
  • పాల్గొన్న గడ్కరీ, రాజ్ నాథ్
Rajnath and Gadkari travels in a cargo plane which performed landing on highway air strip in Rajasthan

దేశంలో అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జాతీయ రహదారులపై ఎయిర్ స్ట్రిప్ లు నిర్మిస్తుండడం తెలిసిందే. వీటి నిర్మాణం దాదాపుగా పూర్తికావొస్తోంది. రాజస్థాన్ లోని బాద్మేర్ వద్ద జాతీయ రహదారి (925ఏ)పైనా ఈ అత్యవసర రన్ వే నిర్మించారు. ఈ ఎయిర్ స్ట్రిప్ ప్రారంభోత్సవానికి కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో, భారత వాయుసేనకు చెందిన సి-130జే రవాణా విమానాన్ని బాద్మేర్ హైవేపై ప్రయోగాత్మకంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తదితరులు ప్రయాణించారు. అంతకుముందు ఓ యుద్ధ విమానం సైతం ఈ హైవే ఎయిర్ స్ట్రిప్ పై విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ లను ప్రదర్శించింది.

More Telugu News