Anil Ambani: రూ. 4,660 కోట్ల కేసులో అనిల్ అంబానీకి సుప్రీంలో ఊరట

  • రిలయన్స్ ఇన్ఫ్రా-ఢిల్లీ మెట్రో కేసులో అనిల్ అంబానీకి ఊరట
  • రిలయన్స్ ఇన్ఫ్రాకు వడ్డీతో కలిపి చెల్లించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు
  • 5 శాతం వరకు పెరిగిన రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ వాల్యూ
Anil Ambani gets relief in Supreme Court

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రిలయన్స్ ఇన్ఫ్రా-ఢిల్లీ మెట్రో కేసులో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 2017లో ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును సుప్రీం ఈ సందర్భంగా సమర్థించింది. రిలయన్స్ ఇన్ఫ్రాకు వడ్డీతో కలిపి పరిహారాన్ని చెల్లించాలని ఢిల్లీ మెట్రోను ఆదేశించింది. ఈ మొత్తం సుమారుగా రూ. 4,660 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ గ్రూపుకు సుప్రీంకోర్టు తీర్పు ఎంతో ఊరటను కల్పించేదే. మరోవైపు సుప్రీకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ 5 శాతం వరకు లాభపడింది.

కేసు వివరాల్లోకి వెళ్తే... రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఒక విభాగం మన దేశంలో తొలి ప్రైవేటు రైలు సేవలను అందించేందుకు 2008లో ఒప్పందం చేసుకుంది. అయితే ఫీజు, నిర్వహణ అంశాల్లో వివాదం నెలకొనడంతో.. కాంట్రాక్టు నుంచి 2012లో బయటకు వచ్చేసింది. పరిహారం ఇవ్వాలంటూ ఢిల్లీ మెట్రోపై ఆర్బిట్రేషన్ కేసు దాఖలు చేసింది.

More Telugu News