Nara Lokesh: లోకేశ్ ను తరలిస్తున్న పోలీసులు.. తీవ్ర ఉత్కంఠ!

Police shifting Nara Lokesh to unknown place
  • గన్నవరం ఎయిర్ పోర్టులో లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • లోకేశ్ ను కాన్వాయ్ తో పాటు తరలించిన పోలీసులు
  • ఎక్కడకు తరలిస్తున్నారనే విషయంలో కాసేపట్లో క్లారిటీ 
గన్నవరం ఎయిర్ పోర్టులో టీడీపీ నేత నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను అక్కడి నుంచి తరలిస్తున్నారు. లోకేశ్ కాన్వాయ్ చుట్టూ పోలీసు వాహనాలు అనుసరిస్తున్నాయి. మీడియాతో లోకేశ్ మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే, ఆయనను ఎక్కడకు తరలిస్తున్నారనే అంశంపై పోలీసులు మాట్లాడటం లేదు. ఈ విషయాన్ని పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం వాహనాలు గన్నవరం హైవేపైకి వచ్చాయి.

మరోవైపు లోకేశ్ తో పాటు విమానంలో వచ్చిన పలువురు టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అంబులెన్సులోకి ఎక్కించారు. అనంతరం వారిని విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ టెర్మినల్ వైపు మళ్లించారు. వారందరి నుంచి లోకేశ్ ను దూరం చేసి, విమానాశ్రయం నుంచి తరలించారు. లోకేశ్ ను పోలీసులు ఎక్కడకు తరలిస్తున్నారనే విషయంలో కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత ఫిబ్రవరి 24న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటనకు సిద్ధమయిన సంగతి తెలిసిందే.
Nara Lokesh
Gannavaram
Arrest

More Telugu News