ఈ అందాల మందారం పూజ హెగ్డే చుట్టమేనట!

09-09-2021 Thu 11:18
  • మరో మంగళూరు భామ పాయల్ రాధాకృష్ణ
  • మోడలింగ్ వైపు నుంచి వెబ్ సిరీస్ లకు
  • 'తరగతి గది దాటి'తో గుర్తింపు
  • సురేందర్ రెడ్డి సినిమాలో ఛాన్స్    
Payal Radhakrishna in Surendar Reddy movie

ఇటీవల కాలంలో సినిమాలతో పోటీపడుతూ వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా కొత్త కథానాయికలకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. అలా 'తరగతి గది దాటి' అనే వెబ్ సిరీస్ ఈ మధ్య 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా 'పాయల్ రాధాకృష్ణ' నాయికగా పరిచయమైంది.

చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఈ అమ్మాయి యూత్ ను ఆకట్టుకుంది. మంగళూరుకు చెందిన ఈ బ్యూటీ, పూజ హెగ్డేకి దూరపు బంధువు అనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆమె గైడెన్స్ తోనే మోడలింగ్ వైపు వెళ్లిన ఈ అమ్మాయి, వెబ్ సిరీస్ ల వైపు వచ్చిందని చెప్పుకుంటున్నారు.

ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అమ్మాయి సురేందర్ రెడ్డి సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుందని అంటున్నారు. ప్రస్తుతం అఖిల్ తో 'ఏజెంట్' సినిమా చేస్తున్న సురేందర్ రెడ్డి, ఆ తరువాత సినిమాను నితిన్ తో చేయనున్నాడు. ఈ సినిమా కోసం పాయల్ రాధాకృష్ణను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.