T20 World Cup: టీ20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టు ఇదే.. ప్రకటించిన బీసీసీఐ

Indian Squad for ICC T20 world cup announced
  • ఎడమచేతి వాటం ఓపెనర్ ధవన్‌కు దక్కని చోటు
  • సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్‌కు చోటు
  • అక్టోబరు 10 వరకూ మార్చుకునే అవకాశం
టీ20 ప్రపంచ కప్ ఆడే భారత స్క్వాడ్‌ను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 15 మందితో జట్టును వెల్లడించింది. దీనిలో ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవన్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్‌లకు అనూహ్యంగా టీ20 జట్టులో స్థానం దక్కింది.

భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్‌ బుమ్రాను పేసర్లుగా ఎంపిక చేసింది. సెప్టెంబరు 10 కల్లా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల వివరాలను తెలపాలనే ఐసీసీ నిబంధన ప్రకారమే బీసీసీఐ ఈ జట్టును వెల్లడించింది. అయితే అక్టోబరు 10 వరకూ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ జట్టుకు భారత మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

భారత జట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ.
T20 World Cup
Team India
Suryakumar Yadav
Rahul Chahar

More Telugu News