Narayana Swamy: కమ్మ కులానికి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదు: ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

Chandrababu has done nothing to Kamma Caste says minister Narayana Swamy
  • ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన ఘనత చంద్రబాబుది
  • మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల సంఖ్యను సగానికి తగ్గించాం
  • లిక్కర్ మాఫియా చంద్రబాబు చేతిలోనే ఉంది
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారని... కానీ చంద్రబాబు మాత్రం మద్యపాన ఉద్యమం చేస్తామని అంటున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన ఘనత చంద్రబాబుదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల సంఖ్యను సగానికి తగ్గించామని చెప్పారు. టీడీపీ హయాంలో ఉన్న 43 వేల బెల్టు షాపులను రద్దు చేశామని తెలిపారు.

మద్యం కావాలని కోరుకునే ఉద్యమానికి చంద్రబాబు నాయకుడని నారాయణస్వామి అన్నారు. లిక్కర్ మాఫియా చంద్రబాబు చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతుంటే... డబ్బులు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణల్లో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. మద్య నియంత్రానికి, మద్య నిషేధానికి పెద్ద తేడా లేదని అన్నారు. టీడీపీ హయాంలో నాణ్యమైన రోడ్లు వేయించలేదని... అందుకే మూడేళ్లకే రోడ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇతర కులాలకే కాకుండా, కమ్మ కులానికి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు.
Narayana Swamy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News