రామ్​ గోపాల్ వర్మతో అషురెడ్డి బోల్డ్​ ఇంటర్వ్యూపై ఆమె తల్లి రియాక్షన్.. వీడియో ఇదిగో

08-09-2021 Wed 14:42
  • సమాజానికి సందేశం ఇచ్చావంటూ ప్రశంస
  • ఇంటర్వ్యూ బోల్డ్ గా, స్ట్రాంగ్ గా ఉందని కామెంట్
  • వీడియోను షేర్ చేసిన అషురెడ్డి, ఆర్జీవీ
Ashu Reddy Mothers Reaction After Bold Interview with RGV

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలో అషురెడ్డి ఎంత బోల్డ్ గా మాట్లాడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా వర్మ అంటేనే బోల్డ్ నెస్ కు మారుపేరు. నిర్మొహమాటంగా మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పేస్తారు. ఇక అషురెడ్డితో ఇంటర్వ్యూ సందర్భంలోనూ వర్మ అలాగే బిహేవ్ చేశారు. థైస్ బాగున్నాయంటూ కామెంట్ చేయడంతో.. ఆమె వర్మను లాగి పెట్టి కొట్టింది. ఇంటర్వ్యూ అంతా అలాగే సాగింది.

మరి, ఆ ఇంటర్వ్యూని చూసిన అషురెడ్డి తల్లి స్పందన ఎలా ఉంటుంది? ఇదిగో ఆ వీడియోనే అషురెడ్డి షేర్ చేసింది. 'ఇదీ.. మా అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్పింది' అంటూ పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో అషును ఆమె మెచ్చుకుంది. ఇంటర్వ్యూ బాగుందని, బోల్డ్ గా, స్ట్రాంగ్ గా ఉందని చెప్పింది. సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చేలా ఉందని అషును ప్రశంసించింది. ఆ వీడియోను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.