వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య‌కేసులో సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రైన ఆయ‌న సోద‌రుడు వైఎస్‌ సుధీకర్‌రెడ్డి

08-09-2021 Wed 13:35
  • కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో విచార‌ణ‌
  • అనుమానితులతో పాటు వైఎస్‌ కుటుంబ సభ్యులను ప్ర‌శ్నిస్తోన్న అధికారులు
  • ఇప్ప‌టికే ప‌లువురు అనుమానితులు, సాక్షుల‌ను విచారించిన సీబీఐ
trial in viveka murder case

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచార‌ణ కొన‌సాగిస్తోంది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో ఈ రోజు కూడా అధికారులు పలువురిని విచారిస్తున్నారు. ఈ రోజు విచారణకు వివేకా సోదరుడు వైఎస్‌ సుధీకర్‌రెడ్డి హాజరు కావ‌డం గ‌మనార్హం.

అనుమానితులతో పాటు వైఎస్‌ కుటుంబ సభ్యులను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసు గురించి మరింత సమాచారం సేకరించడంలో భాగంగా సుధీకర్‌ రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు అనుమానితులు, సాక్షుల‌ను విచారించిన సీబీఐ అధికారులు కీల‌క వివ‌రాలు రాబ‌ట్టారు.