Thief: తండ్రి విశ్రాంత ఏసీపీ, కుటుంబంలో పలువురు న్యాయవాదులు... అయినా ఇతను మాత్రం చోరీలనే వృత్తిగా ఎంచుకున్నాడు!

  • ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన మీర్
  • టీనేజ్ లోనే చోరీల బాట
  • జల్సాలకు అలవాటుపడిన వైనం
  • మిగిలిన సొత్తును పేదలకు పంచే గుణం
  • ఇప్పటిదాకా 140 చోరీలు
  • రిమాండ్ కు తరలించిన పోలీసులు
Hyderabad police arrests thief

అతడి పేరు మీర్ ఖాజమ్ అలీఖాన్. వయసు 27 సంవత్సరాలు. హైదరాబాదు హకీంపేటలో నివసిస్తుంటాడు. మీర్ తండ్రి గతంలో పోలీసు డిపార్ట్ మెంట్  లో ఏసీపీగా పనిచేశాడు. భార్య, సోదరి న్యాయవాదులు. అతడి సోదరులు విదేశాల్లో ఉంటున్నారు. ఇంతటి ఘనమైన నేపథ్యం ఉన్న మీర్ చోరీల బాటపట్టాడు. ఒకటీ రెండూ కాదు 140 దొంగతనాలతో పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.

మీర్ ప్రత్యేకత ఏంటంటే ధనికులు నివసించే ప్రాంతాల్లోని ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటాడు. ఇళ్లమందు రెండు, మూడు కార్లు నిలిపి ఉంచే విలాసవంతమైన బంగ్లాలను ఎంచుకుని దొంగతనం చేస్తాడు. ఇంతజేసీ చోరీ సొత్తును తన జల్సాలకు వాడుకోవడం మాత్రమే కాకుండా, మిగిలిన సొత్తును ఫుట్ పాత్ లపై నివసించేవారికి, బిచ్చమెత్తుకునే వారికి పంచేస్తాడు.

టీనేజ్ లోనే దొంగగా మారిన మీర్ జైలుకు వెళ్లొచ్చినా మారలేదు. తాజాగా అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఓ కేసులో రిమాండ్ కు తరలించారు.

More Telugu News