Team India: ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో టీమిండియా పైపైకి!

Team India topped ICC Test Championship points table
  • ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో టీమిండియా విన్
  • 2-1తో సిరీస్ లో ముందంజ
  • ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో అగ్రస్థానం
  • భారత్ ఖాతాలో 26 పాయింట్లు
  • రెండోస్థానంలో దాయాది పాకిస్థాన్
ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించిన కోహ్లీ సేన ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

26 పాయింట్లతో టాప్ లో ఉన్న భారత్ కు రెండో స్థానంలో ఉన్న పాక్ కు 14 పాయింట్ల అంతరం ఉంది. పాక్ ఖాతాలో 12 పాయింట్లున్నాయి. ఇక ఇంగ్లండ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నా ఓటముల శాతం ఎక్కువగా ఉండడంతో పాక్, వెస్టిండీస్ (12)ల తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది.
Team India
ICC Test Championship
Points Table
England
Test Series

More Telugu News