తొందరేం లేదు.. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడంపై టర్కీ

07-09-2021 Tue 20:58
  • ప్రపంచానికి పిలుపునిచ్చిన టర్కీ విదేశాంగ మంత్రి
  • కాబూల్ ఎయర్‌పోర్టును తెరిపించడం కోసం మంతనాలు
  • ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా ఇదే మాట
no need to rush in recognizing Taliban government says Turkey
ఆఫ్ఘనిస్థాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో.. టర్కీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాలిబన్ ప్రభుత్వాన్ని వెంటనే గుర్తించాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ సమాజానికి సూచించింది. తాలిబన్ల ప్రభుత్వం అందరి కూటమిలా ఉండాలని, మహిళలతోపాటు మైనార్టీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కావుసోగ్లు అన్నారు.

కాబూల్‌‌లో ఇంకా టర్కీ ఎంబసీ పని చేస్తోంది. ఇక్కడి హమీద్ కర్జాయ్ విమానాశ్రయం ద్వారా సహాయక కార్యక్రమాలు ప్రారంభించేందుకు తాలిబన్లతో టర్కీ ఎంబసీ వర్గాలు మంతనాలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక టీవీ ప్రకటన చేసిన మెవ్లట్ కవాసోగ్లు.. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడంలో తొందరేమీ లేదని అన్నారు. ఇది తాము ప్రపంచానికి ఇచ్చే సలహా అని చెప్పారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కాగా, కొన్ని రోజుల క్రితం యూరోపియన్ యూనియన్ కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే.