10 కంటే ఎక్కువ కేసులు నమోదైతే పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలిచ్చాం: మంత్రి అవంతి
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- తెరుచుకున్న పాఠశాలలు
- స్కూళ్లలో కరోనా కేసులు తక్కువేనన్న అవంతి
- ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లపైనా స్పందన
అటు, ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లపై హైకోర్టు తీర్పు పట్ల కూడా మంత్రి అవంతి స్పందించారు. ఈ ఏడాది ఆన్ లైన్ అడ్మిషన్లు చేసుకోవచ్చని గతేడాది హైకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇంటర్, డిగ్రీలో ఆన్ లైన్ అడ్మిషన్ల ద్వారా రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలవుతాయని వివరించారు.