ఢిల్లీకి పోయి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు

07-09-2021 Tue 14:59
  • ఢిల్లీలో తెలంగాణ భవన్ ఎవరి కోసం కడుతున్నారు?
  • టీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదు
  • అన్ని జిల్లాల్లో దళితబంధు ఇవ్వాలి
Bandi Sanjay fires on KCR
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అక్కడ ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ ను ఎవరి కోసం, ఎందుకోసం కడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ను బీజేపీ నమ్మదని.. టీఆర్ఎస్ తో కలిసి బీజేపీ పని చేసే ప్రసక్తే లేదని అన్నారు. మతతత్వ పార్టీ ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ పని చేస్తోందని మండిపడ్డారు.

దళితబంధు మాదిరే బీసీ బంధు, గిరిజన బంధు కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 80 శాతం మంది హిందువులు ఉన్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని కేసీఆర్... దళితబంధు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.