కరోనా ఎఫెక్ట్.. కోహ్లీ, రవిశాస్త్రిల తీరుపై బీసీసీఐ ఆగ్రహం!
- లండన్ లో బుక్ లాంచింగ్ కార్యక్రమానికి వెళ్లిన వైనం
- శాస్త్రితో పాటు భరత్, శ్రీధర్ లకు కరోనా పాజిటివ్
- అనుమతి లేకుండానే ఈవెంట్ కు వెళ్లడంపై బోర్డు ఆగ్రహం
గత వారం వీరందరూ కలిసి లండన్ లో జరిగిన ఒక బుక్ లాంచింగ్ కార్యక్రమానికి వెళ్లొచ్చారు. కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా ఈ ఈవెంట్ కు వెళ్లారు. అయితే ఈ ముగ్గురూ కరోనా బారిన పడినప్పటికీ... ఆటగాళ్లకు మాత్రం వైరస్ సోకలేదు. మరోవైపు, ఈ కార్యక్రమానికి వెళ్లడానికి వీరు బీసీసీఐ అనుమతి కూడా తీసుకోలేదు. ఈ అంశాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది.
అనుమతి లేకుండానే ఈవెంట్ కు వెళ్లడంపై వివరణ ఇవ్వాలంటూ కోహ్లీ, రవిశాస్త్రిలను బీసీసీఐ కోరింది. ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే బీసీసీఐకి అందాయి. దీనిపై బోర్డు విచారణ ప్రారంభించింది.